జాతీయ రహదారి 65 పై ఘోర రోడ్డు ప్రమాదం..

  • ఇద్దరు మృతి 6 గురికి తీవ్ర గాయాలు
  • హైదరాబాద్ వైపు భారీ ట్రాఫిక్ జామ్..

చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రంగా గాయలయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నార్కట్పల్లి వైపు వెళ్తున్న డి-మ్యాక్స్ వి క్రాస్ వాహనం ను ఇన్నోవా కారు డిక్కోట్టడం తో టైర్ బ్లాస్ట్ అయ్యి అదుపుతప్పి డివైడర్ దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న రోడ్డు సైడ్ దూసుకు వచ్చిoది. చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కియా కారు, షిఫ్ట్ డిజైర్ కార్లను ఢీకొట్టడంతో డిజైర్ కారులో ప్రయాణించే ఆరుగురు వ్యక్తులలో దేప సరిత (46), కసిరెడ్డి దేవేందర్ రెడ్డి (సుమారు 50)లు తీవ్రంగా గాయపడి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని చికిత్స నిమిత్తం నార్కట్ పల్లి లోని కామినేని ఆసుపత్రి కి తరలించారు. అలాగే కియా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని హైదరాబాద్ కు తరలించారు. మరో వ్యక్తికి స్వల్పంగా గాయాలు కావడంతో చౌటుప్పల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై జరిగిన సంఘటన వల్ల హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన చిట్యాల పోలీసులు, ఎన్ హెచ్ ఎ ఐ సిబ్బంది, నేషనల్ హైవే ట్రాఫిక్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు పై ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసే చర్యలు చేపట్టారు..