పెద్దకాపర్తి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చిట్యాల, ఆంధ్రప్రభ : పెద్దకాపర్తి గ్రామ శివారులో గల గాంధీ గుడి కి దగ్గరలో విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్ళు దారిలో ఎన్ హెచ్ 65 కు పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా సమాచారం రాగా, ఆదివారం చిట్యాల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించగా సుమారు 65 నుండి 70 సంవత్సరముల వయసు ఉండి బిక్షాటన చేసే వ్యక్తిలా,మృతుని ఒంటిపై బ్లూ రంగులో, తెలుపు రంగులో గల లుంగీ దరించి ఉన్నాడు. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు.
