బాధిత కుటుంబానికి చేయూతనందించాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : నిరుపేద బాధిత కుటుంబానికి ప్రతి ఒక్కరు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని అమ్మాపురం గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఇటీవల మృతి చెందిన కిన్నెర గుంశావళి (30) తన ఇద్దరు కుమారులైన కిన్నెర విలాస్ ( 5), కిన్నెర వికేష్ ( 3) చిన్నారులను ఉరివేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల పిలుపుమేరకు శనివారం బాధిత కుటుంబాన్ని సందర్శించి, పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం, రూ.5 వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో మండలంలోని నిరుపేద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ చేతనందించాలని కోరారు.

అమ్మాపురం గ్రామానికి చెందిన గుంషావలి మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతూ కన్నబిడ్డలని కడతేర్చి తాను చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని, కొందరు చిన్న వయసులోనే ఇలాంటి మత్తు మద్యపానం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు అలవాటై తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ హృదయ విదారక ఘటన వలన రోడ్డున పడిన గుంశావళి భార్య మరియు అతని కూతురును చూసి బాగోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్,శాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి,అమ్మాపురం గ్రామ ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, కర్కాల సర్పంచ్ ఎర్ర వెంకటరెడ్డి,మడిపల్లి గ్రామ అధ్యక్షుడు వెన్నెం సోమిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముద్దం మహబూబ్ రెడ్డి, ముద్దం విక్రం రెడ్డి,మాచర్ల అరవింద్, రామ్మూర్తి , గూడెల్లి సోనసయ్య,బి. వెంకన్న యాదవ్, వల్లపు రాఘవులు, మహంకాల సంపత్, కృష్ణ యాదవ్, సిరిపాటి శివాజీ, తూర్పాటి శీను, గంధం శ్రీరాములు,భద్రయ్య, కళ్యాణి శ్రీనివాస్, సిరిపాటి వెంకన్న సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.