Budget | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

Budget | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

Budget | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. “తులం బంగారం మోసం మోసం”, “రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం”, “బడ్జెట్ మోసం మోసం” అంటూ నినాదాలు చేశారు. వాకౌట్ అనంతరం శాసనసభ ఎంట్రీ వద్ద ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply