Congress| ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

Congress| జన్నారం, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచి జక్కు భూమేష్, కలమడుగు వాసి, మాజీ సర్పంచి బొంతల మల్లేష్( బీజీపీ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కేంద్రంలోని ఆర్ఆర్ఎస్ బంకటాల్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో వారందరికీ ఎమ్మెల్యే కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సర్పంచి,వార్డు సభ్యుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ ఐకమత్యంగా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply