Operation Ci : ఆచూకీ చిక్కట్లే,, దొరకట్లే Andhra Prabha Crime Story

Operation Ci : ఆచూకీ చిక్కట్లే,, దొరకట్లే Andhra Prabha Crime Story

  • అత్యాచారం కేసులో కొత్త మలుపు
  • రంగంలో మూడు పోలీసు బృందాలు
  • ఆధునిక టెక్నాలజీ వినియోగం
  • ఆపరేషన్ మల్లయ్యపై ఉత్కంఠ

( ఆంధ్రప్రభ , పల్నాడు ప్రతినిధి )

మహిళపై అత్యాచార ఆరోపణల్లో చిక్కుకుని ,, పోలీసు కేసులో అదృశ్యమైన సీఐ చిన్న మల్లయ్య కోసం పల్నాడు పోలీసులు జల్లెడ పట్టారు. వినుకొండ సీఐ నేతృత్వంలొ మూడు పోలీసు బృందాలు,, పరారీ సీఐ కోసం వేట సాగిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ప్రయోగించి… సీఐ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సీఐ చిన్న మల్లయ్య జాడ దొరకటం లేదు. కనీసం సమాచారమూ చిక్కటం లేదు. అసలు ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సస్పెన్షన్ లో ని సీఐ చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేయటంతో… ప్రస్తుతం పోలీసుల ఆపరేషన్​ మల్లయ్య తెరమీదకు వచ్చింది. నేరారోపణలు తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే ముందస్తు బెయిల్​ ఇవ్వడానికి వీలు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ బెయిలిస్తే సిఐ తన హోదాను అడ్డుపెట్టుకొని దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదని పేర్కొంది. మరో వైపు సీఐ కుమారుడు తనను ఫోన్ లో బెదిరిస్తున్నాడని బాదిత మహిళ కోర్టు లో ఆందోళన వ్యక్తం చేసింది.

Operation Ci : ముందస్తుగానే అదృశ్యం

వీఆర్​ లోని చిన్న మల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డా రంటూ అంటూ…పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చిన్న మల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. బాధితురాలి తరపున న్యాయవాది.. అనేక అంశాలను కోర్టుకు విన్నవించారు. అత్యాచార ఆరోపణలు చేస్తున్న మహిళ పిటిషనర్ నుంచి అనేక సార్లు సొమ్ము తీసుకున్నారన్నారు. ఐదేళ్లుగా సీఐకి ఆమె తెలుసన్నారు. పిటిషనర్ కోసం ఆయన కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ దర్యాప్తు ఏ దశలో ఉంది, నిందితుడిని అరెస్ట్ చేయలేదని సహాయ పీపీ ప్రియాంకను ప్రశ్నించారు.

Operation Ci : పరారీలోనే….

‘నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడి కుమారుడు బాధితురాలికి మెసేజ్లు పంపి ఎందుకు బెదిరించారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. బెయిలు మంజూరు చేయ వద్దని అసిస్టెంట్​ పీపీ కోరారు. ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న చిన్నములయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Operation Ci : గత వారం రోజులుగా… జల్లెడ

కోర్టు తీర్పు నే పథ్యంలో చిన్న మల్లయ్య ను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు వెతుకులాటను ప్రారంభించాయి. ప్రస్తుతం మూడు బృందాలు సీఐ కోసం గాలిస్తున్నాయి. బాధిత మహిళతో రాజీప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే… సీఐ అదృశ్యం ఓ కొలిక్కి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఎన్ని జరిగినా.. సీఐ అరెస్టు ఖాయం.. రిమాండు ఖాయం. అయితే.. ఆయనకు తక్షణమే బెయిల్​ అవకాశం లభించే వరకూ.. ఆయన చిక్కడు.. దొరకడు అని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ALSO READ : Money Mafia : వామ్మో… ‘కాల్‌మనీ’ చీకట్లు..! Andhra Prabha Top Story

Leave a Reply