45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra Prabha News

45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra Prabha New
- 45 రోజుల ప్రతిపాదన తిరస్కరణ
- ఈజిప్ట్, పాక్, టర్కీ మధ్యవర్తిత్వం విఫలం
- చర్చలపై ఇరాన్ కఠిన వైఖరి..
- పూర్తి డిమాండ్లే షరతు
- సౌత్ పార్స్‌పై దాడి..
- ఇంధన రంగానికి భారీ దెబ్బ
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు
- గల్ఫ్ దేశాలు హై అలర్ట్..
- ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివ్
- యుద్ధ విరామం వెనుక వ్యూహాలపై అనుమానాలు
( ఆంరప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)

హోర్ముజ్ జలసంధిని తెరవక పోతే.. నరకం వర్షం కురిపిస్తానని గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరమీదకు తీసుకు రాగా.. ఇరాన్ నిర్ధాక్షణ్యంగా తిరస్కరించింది. ఒక వైపు చర్చలు జరుపుతూనే సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ తో కలిసి వైమానిక దాడులు జరిపింది.

ఈ దాడుల్లో 25 మంది ఇరానీలు మృతి చెందారు. ఇక ఇరాన్ కూడా ఆగలేదు. ఇజ్రాయెల్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుని ప్రతిదాడులకు దిగింది. తాజాగా అమెరికా ప్రతిపాదనను ఇరాన్ వెనక్కి తిప్పి కొట్టటంతో.. అమెరికా ఇక ముందుకు సాగతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మధ్యవర్తులు చర్చల కోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ, ఇరువైపులా ఉద్రిక్తతలు అధికంగానే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిం,ఛిన గడవు తీరిపోయింది. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించారు.
45 Days Iran Rejects : త్రిమూర్తుల యత్నం

45 రోజుల కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని కోరుతూ ఈజిప్ట్, పాకిస్తాన్, టర్కీ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనను ఇరాన్ అమెరికాకు పంపినట్లు పంపించాయి. విస్తృత చర్చలకు బహుశా మరింత శాశ్వత శాంతి ఒప్పందానికి సమయం కల్పించడమే ఈ ప్రతిపాదన లక్ష్యం. ఇద్దరు మధ్యప్రాచ్య అధికారుల కథనం ప్రకారం, ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీకి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌కు పంపింది.

శాశ్వత కాల్పుల విరమణకు చేరుకోవడానికి ఈ దేశాల మధ్య విస్తృత చర్చలకు ఈ 45 రోజుల గడువు తగినంత సమయం ఇస్తుందని మధ్యవర్తులు ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై సోమవారం తొలుత ఇరాన్ స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, కాల్పుల విరమణ ప్రతిపాదన “అహేతుకం” ఆమోదయోగ్యం కాదు అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు “ఎలాంటి హద్దులూ లేవని”, ఈ బెదిరింపులతో ఇరాన్ ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదని ఆయన అన్నారు. ఏ చర్చలకైనా అంగీకరించడంలో ఇరాన్ జాతీయ భద్రతే ప్రధాన అంశమని, ఇరాన్ “తన సర్వశక్తులతో” కాపాడుకుంటోందని ఆయన అన్నారు.
45 Days Iran Rejects : బూతుల పంచాంగం

యుద్ధ విరమణ ప్రతిపాదనపై వాషింగ్టన్ ఇంకా స్పందించలేదు. జలసంధి మూసివేసే ఉంటే విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఆదివారం బూతులతో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్, “ఆ జలసంధిని తెరవండిరా పిచ్చి వెధవల్లారా, లేకపోతే నరకంలో బ్రతుకుతారు, చూస్తూ ఉండండి” అని అన్నారు.
45 Days Iran Rejects : ఇరాన్ తిరస్కరణ

కొనసాగుతున్న చర్చలను కారణంగా చూపుతూ, అమెరికా అధ్యక్షుడు తన గడువులను పదేపదే మార్చుకుంటున్నారు. టెహ్రాన్ తిరస్కరిస్తోంది ట్రంప్ వాదనలను, బెదిరింపులను టెహ్రాన్ పదేపదే తోసిపుచ్చుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ రెజా సలేహి అమీరి, ట్రంప్‌ను “అస్థిర , భ్రమల్లో బతికే వ్యక్తి” అని అభివర్ణించారు. ఆయన ప్రకటనలు తరచుగా మారుతుండటంతో ఇరానీయులు వాటిని సీరియస్‌గా తీసుకోరని కూడా ఆయన అన్నారు.
45 Days Iran Rejects : హోర్ముజ్ తెరిచే ఉంది
ట్రంప్‌ను అర్థం చేసుకోవడం ఇరుపక్షాలకూ కష్టమని కూడా ఆయన వర్ణించారు. “ట్రంప్ ఒక దృగ్విషయంగా మారినట్లు కనిపిస్తోంది, ఇరానీయులు గానీ, అమెరికన్లు గానీ ఆయనను పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు,” అని సలేహి అమీరి జోడించారు. “జలసంధి విషయానికొస్తే, అది ప్రపంచానికి తెరిచి ఉంది, కానీ ఇరాన్ శత్రువులకు మూతపడింది.
45 Days Iran Rejects : ఆ 45 రోజులు ఎవరికి లాభం?
ప్రస్తుతం 45 రోజుల పాటు కాల్పులను విరమిస్తే.. ఎవరికి లాభం. ఇరాన్ కు కాదు? అమెరికాకే ప్రయోజనం. ఈ విరామ సమయంలో ఆయుధాలను పోగు చేసుకుంటుంది. అలాగే ఇరాన్ సరిహద్దుల్లో మొహరిస్తుంది. చర్చలు విఫలం అంటూ.. మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇదీ ఇరాన్ అనుమానం

ఎందుకంటే. మాటల గారడీని పక్కన పెడితే, టెహ్రాన్ పాలకవర్గం వైఖరి దృఢంగానే ఉంది. ఆర్థిక నష్టపరిహారం, మళ్లీ తమపై దాడి జరగదనే హామీలతో సహా, సరైన భరోసా లభించే వరకు అది పోరాటాన్ని విరమించదు. ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం, సోమవారం ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్‌పై వరుస దాడులు చేశాయి. ఈ దాడుల్లో 25 మందికి పైగా మరణించడంతో పాటు, సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రం కూడా దెబ్బతింది. దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్, ఇజ్రాయెల్ గల్ఫ్ పొరుగు దేశాలపై క్షిపణి దాడులు చేసింది..
45 Days Iran Rejects : గల్ఫ్ కంట్రీస్… హై అలెర్ట్..

ఇరాన్ అతిపెద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ సౌత్ పార్స్ (South Pars) పై సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడితో ఇరాన్ 50% పెట్రోకెమికల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇంధన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.ఈ స్థితిలో గల్ఫ్ దేశాలన్నీ తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను హై-అలర్ట్‌లో ఉంచాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరా లో టెలికాం బిల్డింగ్ ,
అబుదాబిలోని ముసఫా (Mussafah) పారిశ్రామిక ప్రాంతాన్ని టార్టెట్ చేశాయి.
దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 12 బాలిస్టిక్ క్షిపణులు, 19 డ్రోన్లను అడ్డుకున్నాయి. శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్ (Kuwait):లో రెండు విద్యుత్ నీటి శుద్ధి ప్లాంట్లు (Desalination plants) తీవ్రంగా దెబ్బతిన్నాయి. చమురు శుద్ధి కర్మాగారాల్లో (Oil facilities) మంటలు చెలరేగాయి. ఖతార్‌లోని ప్రధాన గ్యాస్ కేంద్రమైన రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక నగరంపై జరిగిన క్షిపణి దాడుల వల్ల గ్యాస్ ఎగుమతి సామర్థ్యం 17% మేర తగ్గింది. సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థలు రెండు డ్రోన్లను అడ్డుకున్నాయి. ఇరాన్ దాడుల తీవ్రత పెరగడంతో ప్యాట్రియాట్ (Patriot) క్షిపణి నిల్వలు 14% కి పడిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
