కేటీఆర్ సమక్షంలో ధర్మేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు
పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించిన పార్టీ నాయకులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా కేటీఆర్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో ధర్మేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
