ఉట్నూర్‌లో బీజేపీ నిరసన…

ఉట్నూర్‌లో బీజేపీ నిరసన…

  • కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీజేపీ నాయకులు ఉట్నూర్‌లో ఆందోళన చేపట్టారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా మహిళల పట్ల వారి వైఖరి బయటపడిందని విమర్శించారు. దేశంలోని మహిళలు బీజేపీకి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు.

మహిళా బిల్లు, పునర్విభజన బిల్లులు భవిష్యత్తులో అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మాజీ ఎంపీటీసీలు సీపతి లింగ గౌడ్, కందుకూరి రమేష్, సాల్గరే రవీందర్, మాజీ ఎంపీపీ ఆడే ధన్లాల్, లీగల్ సెల్ నాయకుడు భానోత్ జగన్ నాయక్, అలాగే బీజేపీ నాయకులు సాడిగే రాజేశ్వర్, బొడ్డు కిరణ్, కాల్వ రవి, గొల్లె భకీర్త, మరికంటి నారాయణ, గంటా విజయ్, కాల్వ సతీష్, సంపంగి గంగాధర్, కుటికెల రమేశ్, పులి శ్రీకాంత్, కనక విజయ్, శ్రీనివాస్, బాణావత్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply