సర్ పై బీజేపీ సమీక్ష..
- సర్ కార్యక్రమంలో అప్రమత్తంగా పనిచేయాలని సూచన
పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఏ-2ల సమావేశం గురువారం పైపుల రోడ్డులోని రాయల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు, సెంట్రల్ నియోజకవర్గ బీఎల్‌ఏ-1 నామిశెట్టి వెంకట్ సూచనలతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఇన్‌చార్జి నార్మి తాతాజీ పాల్గొని బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ప్రతి బీజేపీ బీఎల్‌ఏ బీఎల్‌వోలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సర్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్‌ఏలు చొరవ చూపాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవి రత్నకుమారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు నెమలికంటి సుబ్రహ్మణ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు.
