రెండో రోజూ కొనసాగుతున్న గాలింపు చ‌ర్య‌లు…

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో బుధవారం గల్లంతైన భక్తుడి కోసం రెండో రోజూ గాలింపు చర్యలు కొనసాగాయి. గురువారం నాలుగు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా శోధన చేపట్టినా, భక్తుడి ఆచూకీ లభించలేదు.

వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ, సహాయక బృందాలు నిరంతరంగా శోధన కొనసాగిస్తున్నాయి. భక్తుడి జాడ ఇంకా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గాలింపు చర్యలను మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, ఉపసర్పంచ్ ఆలకుంట వనిత–కృష్ణ, తాడ్వాయి పోలీసులు, మేడారం పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.