అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం

అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం

వైసీపీ గైర్హాజరు ద్వారా కుట్రకోణం బహిర్గతం: రాష్ట్ర ప్రయోజనాలపై నిర్లక్ష్యం
దేవినేని ఉమామహేశ్వరరావు

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని టిడిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకున్న తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు.

అసెంబ్లీకి గైర్హాజరు ద్వారా అమరావతి అంశంపై వైసీపీ కుట్రకోణం బయటపడిందని విమర్శించారు. అధికారం వ్యామోహం తప్ప వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. గత ఐదేళ్లుగా కుట్రలు, కుతంత్రాలతో ప్రజారాజధాని అమరావతిపై విషం చిమ్మారని ఆరోపించారు. 11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాని వైసీపీకి రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా రాజకీయ లాభాల కోసమే వ్యవహరిస్తున్నారని అన్నారు.

నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం పార్టీని స్థాపించారని, పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తుచేశారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ 44 ఏళ్లుగా నిలబడ్డ చరిత్ర టిడిపిదేనని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply