బుడగజంగాల కాలనీ వాసులను స్కూలుకు తరలింపు..

వాగు పక్కనే కాలనీ పొంచి ఉందని ప్రమాదంతో..
ఎమ్మెల్యే ఆదేశంతో కదిలిన యంత్రాంగం..

జన్నారం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలతో వాగు పక్కనే ఉన్న బుడగ జంగాలకాలనీవాసులను సురక్షిత ప్రాంతమైన పక్కనే ఉన్న పాఠశాలకు తరలించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం మండలంలోని
పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగు పక్కనే ఉన్న బుడగ జంగాలకాలనీ వాసులను గురువారం సాయంత్రం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించారు.

ఆ కాలనీ పక్క నుంచి పెద్ద వాగు వరద నీరు ఓడ్లనుతాకుతూ ఉదృతంగా వరద నీరు పారుతుండడంతో పలువురి కాలనీ వాసులను గ్రామ సర్పంచి జక్కు సుష్మ గుప్త, స్థానిక తహసిల్దార్ బక్కయ్య, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, కార్యదర్శి ఆర్.రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్, ఉప సర్పంచి అప్పాల జలపతి, వార్డు సభ్యులు, నేతలు మోషీన్, మల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, జక్కు శ్రీనివాస్, తదితరులు అక్కడికి వెళ్లి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తరలించి సహాయక చర్యలు నిర్వహించారు.