జగన్మాతను దర్శించుకున్న సిఎస్ సాయిప్రసాద్…

జగన్మాతను దర్శించుకున్న సిఎస్ సాయిప్రసాద్…

ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..
కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. సీఎస్ జి. సాయి ప్రసాద్ తన భార్య, కుటుంబ మిత్రులతో కలిసి ఆలయానికి చేరుకోగా ఈ కార్యనిర్వహణాధికారి కలెక్టర్ శీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేపట్టారు.

అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య ఆధ్వర్యంలో సీఎస్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు సీఎస్ దంపతులకు వేదాశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ శీనా నాయక్ సీఎస్ కి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply