APL | విజయవాడ విజయం
- ప్రశాంత్ అబ్బాస్ మెరుపు ఇన్నింగ్స్
- బౌలింగ్లో అదరగొట్టిన ప్రణవ్ రెడ్డి
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రశాంత్
ఆంధ్రప్రభ, విజయవాడ: ఏపీఎల్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా రెండవ రోజు తొలి మ్యాచ్లో విజయవాడ సన్ షైనర్స్ మరియు రాయల్ షాప్ రాయలసీమ జట్ల మధ్య మ్యాచ్ జరగగా మొదటగా టాస్ గెలిచిన రాయలసీమ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్కు దిగిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు ఓపెనర్స్ పర్వాలేదనిపించారు మరియు ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయిన ప్రశాంత్ , అబ్బాస్ ప్రత్యర్థి బౌలర్ల పై బౌండరీల వర్షం కురిపించారు.
ఇద్దరు దాటిగా ఆడుతూ టీం స్కోర్ ను ముందుకు నడిపించారు డిబి ప్రశాంత్ 33 బంతుల్లో 60 పరుగులు 5 ఫోర్లు 2 సిక్సర్లు మరియు షేక్ జహీర్ అబ్బాస్ 20 బంతుల్లో 53పరుగులు 1ఫోర్ మరియు 7సిక్సర్స్ తో 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది రాయలసీమ బౌలర్లలో సాకేత్ రామ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయలసీమ జట్టు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి టీ మొత్తానికి ఇద్దరు బ్యాటర్ల మినహాయించి ఎవరు పెద్దగా రాణించలేదు . తేజ రెడ్డి28 బంతుల్లో 44 పరుగులు 3ఫోర్స్ 3 సిక్సర్స్, వంశీకృష్ణ 23 బంతుల్లో 37 పరుగులు 5 ఫోర్లు 2 సిక్సర్లు తో పర్వాలేదని పించారు. దీంతో 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి189 పరుగులు మాత్రమే చేశారు. దీనితో 19 పరుగులతో విజయవాడ సన్ షైనర్స్ జట్టు విజయం సాధించింది విజయవాడ బౌలర్లలోప్రణవ్ రెడ్డి 4 వికెట్స్ పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా డీబీ ప్రశాంత్ ఎంపికయ్యాడు.
