రాష్ట్ర చెస్ పోటీల్లో ఋషి విద్యాలయం విద్యార్థుల ప్రతిభ

పాయకాపురం, ఆంధ్రప్రభ : చెస్ అనేది మెదడుకు మేత లాంటిదని చెస్ మాస్టర్ ఏ. రామకృష్ణ అన్నారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఋషి విద్యాలయం పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-15 విభాగంలో ఏ.డి. సామ్రిన్, అండర్-13 విభాగంలో ఆకుల లిఖిత్ ప్రథమ స్థానాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ టి. శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెస్ మాస్టర్ ఏ. రామకృష్ణతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.