పోలీస్ వ్యవస్థకు తీరని లోటు..

పోలీస్ వ్యవస్థకు తీరని లోటు..

మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జె దొర మృతి పట్ల మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఆయన పోలీస్ వ్యవస్థలో తనదైన ముద్రవేసిన ఉన్నతాధికారిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. తాను హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో హెచ్‌.జె. దొర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సమర్థవంతంగా సేవలందించారని వసంత నాగేశ్వరరావు గుర్తు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీగా విధులు ప్రారంభించి రాష్ట్ర డీజీపీ స్థాయికి ఎదగడం ఆయన సేవా ప్రస్థానంలో విశేష ఘట్టమని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడం పోలీస్ శాఖకు తీరని లోటని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. దొర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.