ఆ విషయంలో.. ప్రజలు ముందుకు రావాలి..

ఆ విషయంలో.. ప్రజలు ముందుకు రావాలి..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని సీఐ మల్లేష్ అన్నారు. మండలంలోని వేలం పల్లి గ్రామంలో సీసీ కెమెరాల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల అదుపునకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని వివరించారు. దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉంటే, నిందితులను గుర్తించి కేసు ఛేదించడానికి చాలా తక్కువ సమయంలో సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ నేరాలు లేని వాతావరణం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అమూల్య, సర్పంచ్ కూర వెంకటరాజి రెడ్డి, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
