గ్రామ పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్..

గ్రామ పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్..

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామ సర్పంచ్ బండి. భగవాన్ గౌడ్ శుక్రవారం ఉదయాన్నేగ్రామ పారిశుధ్య కార్మికుడిగా మారి, చీపురు పట్టి, చెత్తాచెదారం శుభ్రం చేశారు. కొన్ని రోజులుగా గ్రామ పారిశుధ్య కార్మికులు, రాకపోవడంతో ఊరిలో చెత్త పేరుకుపోయింది. ఇది గమనించిన సర్పంచ్ భగవాన్ స్వయంగా చీపురు చేతబట్టి పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామపంచాయతీలో నలుగురు సిబ్బంది పని చేస్తుండగా ఇద్దరు స్వీపర్లు, ఒకరు పంప్ ఆపరేటర్, మరొకరు కారోబార్ గా పని చేస్తున్నారు. కాగా సర్పంచిని వివరణ కోరగా తమ సిబ్బంది గత నాలుగు రోజులుగా పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారని, దీంతో చెత్తాచెదారం పేరుకుపోవడంతో తనే స్వయంగా పారిశుధ్య పనులు పాల్గొనడం జరిగిందన్నారు.

Leave a Reply