కేంద్రానిదే ధరల పెంపు పాపం
కేంద్రానిదే ధరల పెంపు పాపం
ఆలేరు, ఆంధ్రప్రభ: కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని టి పి సి సి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఘాటుగా విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పేదలపై తన ప్రతాపాన్ని బిజెపి ప్రభుత్వం చూపిందని అన్నారు. సంక్షేమ పథకాలలో పేదలకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత అతి స్వల్పమని ఆయన చెప్పారు. అధికారం కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించే తీరిక కేంద్రంలోని పెద్దలకు లేదని అనేక మార్లు రుజువైందని తెలిపారు. దేశమంతా తామే అధికారంలో ఉండాలన్న ఆలోచన తప్ప మరి విధమైన ప్రయోజనం కనబడడం లేదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల సారధ్యంలో దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం కేంద్రbప్రభుత్వంపై కొనసాగుతున్నదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన చెప్పారు.
