మూడు రోజుల వరుస సెలవులకు అవకాశం!
రెండో శనివారం, ఆదివారం, బోనాలతో లాంగ్ వీకెండ్..
అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ: తెలంగాణలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం సాధారణ సెలవులు ఉండగా, ఆగస్టు 10న బోనాల సందర్భంగా సెలవు ఉండే అవకాశంతో విద్యార్థులు లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించే పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యాసంస్థలకు సంబంధించి ఆగస్టు 10 బోనాల సెలవుపై విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వ 2026 సాధారణ సెలవుల జాబితాలో ఆగస్టు 10న బోనాలు సాధారణ సెలవుగా నమోదైంది. అయితే పాఠశాలలు, కళాశాలలకు అదే విధంగా సెలవు వర్తింపజేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సి ఉంది.
లాంగ్ వీకెండ్‌కు ప్రయాణాల సందడి
మూడు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో చాలామంది విద్యార్థులు, కుటుంబాలు స్వగ్రామాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
ఆగస్టులో ప్రధాన సెలవులు
- ఆగస్టు 10 – బోనాలు (విద్యాసంస్థలకు అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది)
- ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 26 – ఈద్ మిలాద్-ఉన్-నబీ
బోనాల సెలవుపై విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పాఠశాలలు, కళాశాలలకు సెలవుపై పూర్తి స్పష్టత రానుంది.
