కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబంలో వివాదం..
- తండ్రి నుంచి ప్రాణహాని… రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుటుంబంలో వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేకపోవడంతో తనపై దాడి చేయించే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్యే కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు.
తాను ప్రేమించిన యువతి ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించారని, తమ ఇద్దరినీ హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఏ క్షణమైనా తనపై దాడి జరిగే అవకాశం ఉందని, వెంటనే భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
