ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏడీఏ

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ ఏడీఏ ఈరోజు సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఏడీఏ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా కాయ తాలు పేరుతో మిల్లర్లు ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.నిబంధనల మేరకు ధాన్యాన్ని స్వీకరించి,కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ మాధగోని నరసింహ గౌడ్,సెంటర్ ఇన్చార్జ్, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply