IDH Colony | ఆర్టీసీ సమ్మెపై తలసాని స్పందన
IDH Colony | ఆర్టీసీ సమ్మెపై తలసాని స్పందన
IDH Colony | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి సమ్మెను విరమింపచేయాలని మాజీమంత్రి, బి ఆర్ ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా ఎలెక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి వారి ఉద్యోగానికి భద్రత లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అవసరమైన శిక్షణ ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులనే ఎలెక్ట్రికల్ బస్సులలో నియమించాలన్నారు. ఎలెక్ట్రికల్ బస్సులకు డ్రైవర్లు కండక్టర్లుగా ప్రయివేట్ వ్యక్తుల నియామకం, ఆర్టీసి డిపోలు, ఆస్తులను ప్రయివేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా నే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె కు దిగారని మండిపడ్డారు. సమ్మె కారణంగా బస్సులు నడవక విద్యార్థులు, ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు, వ్యాపారులు, పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలు ఎలా ప్రయాణం చేయాలో చెప్పాలని అన్నారు.
