108seats | ప‌థ‌కాల అమ‌లు.. ఓ స‌వాల్‌

108seats | ప‌థ‌కాల అమ‌లు.. ఓ స‌వాల్‌

108seats | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో సత్తా చాటిన దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించ‌బోతున్నాడు. అయితే అస‌లు స‌వాల్‌ ముందుంది. ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం కాగానే, సంతోష‌ప‌డాల్సిన విష‌యం కాదు.. పాల‌నా ప‌రంగా కూడా విజ‌య‌వంతం కావాల్సిన అవ‌స‌ర‌ముంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్ర‌జ‌ల‌కు భారీ పథకాలను ప్రకటించారు. హామ‌లు ఇవ్వ‌డ‌మేకాటు.. ఇప్పుడు వాట‌న్నింటినీ అమ‌లు చేయడం చాలా ముఖ్యం. ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించ‌డ‌మ‌నేది చాలా క్లిష్ట‌త‌రం. దీనిని విజ‌య్ స‌మ‌ర్థ‌వంతంగా, విజ‌య‌వంతంగా ఎలా అమ‌లు చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కం. ఎందుకంటే ప‌థ‌కాల అమ‌లు, అభివృద్ధి ప‌నుల‌కు నిధులు సేక‌రించ‌డ‌మ‌నేది చాలా పెద్ద విష‌యం. విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలంటే, రాష్ట్ర ఖజానాపై ఏడాదికి దాదాపు ₹92,000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఇప్పటికే ఉన్న అప్పులు, పాలనాపరమైన ఖర్చులకు తోడు, ఈ భారీ మొత్తం నిధులు కేటాయించ‌డం కొత్త ప్రభుత్వానికి పరీక్షగా మారనుంది.

ప్రచారంలో విజయ్ ఇచ్చిన ప్ర‌ధాన హామీలివే..

మహిళలకు ఇచ్చే నెలవారీ భృతిని ₹2,500కు పెంచడం.
వృద్ధుల పింఛన్ ను ₹3,000కు పెంచడం
ఉచిత విద్యుత్‌ పరిమితిని 200 యూనిట్లకు పెంచడం.
ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ₹15,000 అందజేత.

Leave a Reply