శివయ్య ఆస్తులు రక్షించాలంటూ ధర్నా…
శివయ్య ఆస్తులు రక్షించాలంటూ ధర్నా…
నందిగామ, ఆంధ్రప్రభ : సుఖ శ్యామలంబసమేత రామలింగేశ్వర స్వామి కి పాత బస్టాండ్ సమీపంలో కోనేరులో విహరించేందుకు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కొంత భూమిని కేటాయించి అందులో కోనేరు నిర్మాణం కూడా ఆయనే చేశారు. అనంతరం కోనేరు కొంత భాగం ఆక్రమణలకు గురి అయింది. గతంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ కోనేరు పునర్దరించాలని చూశారు. కానీ ఆక్రమణదారుల నుతొలగించడంలో అధికారులు, రాజకీయ నాయకులు విఫలమయ్యారు. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ఆక్రమణలకు తొలగించాలని కోనేరును పరిశుభ్రపరచాలని హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు విచారణ అనంతరం ఈ కోనేరు దేవాదాయశాఖకు చెందిన అని తీర్పునిచ్చారు. కానీ దేవస్థానానికి చెందిన కోనేరును ఆక్రమణలు తొలగించి కోనేను పరిశుభ్రచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఎంతవరకు అక్రమంలో జరిగాయి. అక్రమాలను తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు అయితే రెవెన్యూ అధికారులు మీనా మీసాలు లెక్కిస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. శనివారం హిందూ సంఘాలు హిందువులు స్థానిక తాసిల్దార్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ భజన చేశారుగత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న షాపులను తొలగించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ అక్రమాలను తొలగించాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
