క్రీడలకు అధిక ప్రాధాన్యత…

క్రీడలకు అధిక ప్రాధాన్యత…

పాయకాపురం, ఆంధ్రప్రభ : కూటమి హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్‌లోని ఎం.కే. బేగ్ మునిసిపల్ హైస్కూల్‌లో టి.ఎస్.ఆర్ శాస్త్రి (సీతయ్య) స్మారకార్థం నిర్వహిస్తున్న ఏపి, తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడల పట్ల మరింత ఆసక్తి కనబరచి, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, సెక్రటరీ బూదాల సురేష్,ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ గౌసియా, మరకా శ్రీనివాసరావు,మద్దాల మహేష్,స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మైనం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply