సంతాన సాఫల్యానికి ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్…
సంతాన సాఫల్యానికి ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్…
పాయకాపురం, ఆంధ్రప్రభ : సంతాన సాఫల్యానికి ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ అన్నారు.స్థానిక63వ రాజీవ్‌నగర్‌లోని ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్,ఐ. వి.ఎఫ్ చికిత్సలపై ప్రజలకు పూర్తి అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ పాల్గొని ఉచిత ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్,ఐ. వి.ఎఫ్ చికిత్సలను పర్యవేక్షణ చేశారు.ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయని, అయితే చాలామంది ప్రజలకు ఫెర్టిలిటీ సమస్యలు వంటి ఆధునిక చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని. మహిళలు, పురుషులకు అవసరమైన వైద్య పరీక్షలు, సమస్యల గుర్తింపు, చికిత్స విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై వైద్య నిపుణులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఉచిత కన్సల్టేషన్, స్కానింగ్, వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచడంతో పాటు సరైన చికిత్సపై అవగాహన కలుగుతుందని, ప్రజలు ఇటువంటి హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య సమస్యలపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, పద్మ, శశి,డివిజన్ టీడీపీ అధ్యక్షుడు లబ్బ వైకుంటం దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి,ఇంచార్జి మోతుకురి ఖాసిమ్, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను,సెంట్రల్ నాయకులు బెజ్జం జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
