ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాలు నిషేధించాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో ఆన్లైన్ డ్రగ్ మందులను నిషేధించాలని మండల డ్రాగిస్ట్ , కెమిస్ట్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ , తహసిల్దార్ వసంతరావుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. చిట్యాల మండల డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గుర్రపు తిరుపతి గౌడ్ , చిల్లగాని నాగరాజులు మాట్లాడుతూ.. ఆన్లైన్లో డ్రగ్స్ అమ్మకాలు నిషేధించాలని, ఆన్లైన్లో నార్కోటిక్స్ డ్రగ్స్ కూడాసప్లైజరుగుతున్నాయన్నారు.వాటినినిరోధించడానికి ఈనెల 20 న జాతీయస్థాయి బందు పిలుపులో భాగంగా మండలంలో ఉన్న మెడికల్ షాపులు అన్నీ బంద్ చేయబడతాయన్నారు. మండలంలో ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాచర్ల రమేష్, భయగాని వెంకన్న పాల్గొన్నారు.
