ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ

ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ

  • పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్

పెడన, ఆంధ్రప్రభ : కలంకారీ వస్త్రశాలను అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా శుక్రవారం పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ మా నియోజకవర్గంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హమీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా త్వరలోనే కలంకారి క్లస్టర్ పెడన లో ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు.

Leave a Reply