కేటీఆర్‌ను కలిసిన గుంతపల్లి సర్పంచ్ అనంతిరెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావును కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామ సర్పంచ్ పడమటి అనంతిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ,ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సంగారెడ్డి జిల్లా పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. గ్రామస్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలు, చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి అనంతిరెడ్డి వివరించగా, కేటీఆర్ ఆయన సేవలను అభినందించినట్లు సమాచారం.
గుంతపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు అనంతిరెడ్డి తెలిపారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్షించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్‌లో తగిన అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నట్లు అనంతిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అనంతిరెడ్డికి పార్టీ పరంగా మంచి భవిష్యత్ ఉందని కేటీఆర్ ఆశీర్వదించినట్లు ఆయన తెలిపారు.
