గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..
సంఘం నేతల నివాళి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి మాతృమూర్తి మంగళవారం అర్ధరాత్రి పరమపదించారు. ఈ విషాద వార్తతో సంఘం నాయకులు, సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం కరీంనగర్ జిల్లాలోని వారి స్వగ్రామంలో అంత్యక్రియలకు సంఘం రాష్ట్ర నాయకులు సతీష్ తివారి, మాధవరెడ్డి తదితరులు హాజరై మృతికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పరామర్శించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాస్, సిద్దిపేట జిల్లాకు చెందిన బత్తుల రాజు పాల్గొన్నారు.
