19వ వార్డులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో హెల్ప్ ఏజ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజలంతా ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ (బీఎల్‌ఓ) ఐలమ్మ, మాజీ వార్డు సభ్యులు యాట కౌసల్య–ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకింది రమేష్, పాశం రామరాజు, పబ్బు సత్యనారాయణ, వర్కాల రామ్ గౌడ్, చింతకింది గణేష్ గౌడ్, యాట సంతోష్, డాకోజి అజయ్ కుమార్, గుర్రం శ్రీనివాస్, మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ అబ్బాస్, రాజపేట మహేష్, చింతకింది శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
