ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం….

ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం….

రోడెక్కిన అన్నదాతలు
పట్టించుకోని అధికారులు

వెల్దుర్తి, ఆంధ్ర‌ప్ర‌భ : అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు తూకం ఆలస్యం కావడం జరుగుతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మండల పరిధిలోని మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ఉదయం రైతులు, మహిళా రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెల్దుర్తి నర్సాపూర్. ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.తమ గ్రామంలో సుమారు 25 లారీల ధాన్యం ఉందని ఇప్పటివరకు తూతూ మంత్రంగా రెండు లారీల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే లారీలను అందుబాటులో ఉంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల కష్టాలను తీర్చాలని అన్నారు. దీంతో వెల్దుర్తి. నర్సాపూర్. ప్రధాన రహదారి సుమారు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ఎండలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి తహసిల్దార్ శ్రీనివాస్. స్థానిక ఎస్ ఐ రాజు రైతుల వద్దకు చేరుకొని త్వరలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

Leave a Reply