డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నిరసన

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నిరసన

కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ

తిరుపతి, ఆంధ్రప్రభ : డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ నాయకత్వంలో చేపట్టిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వైస్ జగన్ పిలుపు మేరకు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి సూచనలతో, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు దినేష్ రాయల్, సత్తివేడు వినోద్, కాలాస్త్రి సురేష్, నగిరి యువరాజ్, నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.