వివాహ వేడుకలో కలుసుకున్న పూర్వ మిత్రులు

రాయపోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రం రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థి గల్వ అరుణ, తిరుపతిరెడ్డి ల కూతురు వివాహ వేడుకలో ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ మిత్రులు కలుసుకుని సందడి చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై సమావేశమైన వారు చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకకు హాజరైన వారు పరస్పరం పలకరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.పాత స్నేహితుల కలయికతో వివాహ వేడుకలో ప్రత్యేక సందడి కనిపించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ఘట్టం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం పాఠశాలలో క్రీడలు ఆడించిన. పిఈటి మల్లారెడ్డి సార్ ను ఆహ్వాహ వేడుకల్లో కలుసుకున్నారు. ఆయనను చూసి ఆనంద వ్యక్తం చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుడితో కలిసి ఫోటోలు దిగుతూ ఆప్యాయతను వ్యక్తం చేశారు.

Leave a Reply