సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన

సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల అభ్యర్థులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల సమక్షంలో అభ్యర్థులను ప్రకటించారు.
కో ఆప్షన్ అభ్యర్థులు వీరే…
సదాశివపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, మహమ్మద్ రహమత్,ఖాసీం నగర్ కు చెందిన సుల్తానా, రవీంద్ర నగర్ కు చెందిన ఎగమామిడి అనంతమ్మలను ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థులు సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
