సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ధ‌ర్మ‌పురి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజలందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి ఎస్ఐ పులిచెర్ల ఉదయ్ కుమార్(Pulicherla Uday Kumar) తెలిపారు. ఈ రోజు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మపురి మండలంలోని మగ్గిడి మోడల్ స్కూల్‌లో పోలీసు చట్టాలు, షీ టీం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల పై అవగాహన, విద్యార్థుల క్రమశిక్షణ, డయల్ 100, అనేక పోలీసు చట్టాల పై పోలీస్, కళాబృందం చేత అవగాహన కల్పించారు.

పోలీసు కళాబృందం(Police Art Group) అనేక చట్టాల పై పాటలు పాడుతూ విద్యార్థుల కు అర్థం అయ్యే విదంగా తెలిపారు. ఈ సందర్భంగా ధర్మపురి ఎస్ఐ ఉదయకుమార్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులని, సైబర్ నేరాల(Cyber ​​Crime) పట్ల మోసపోవద్దని, చైతన్యంతో మెలగాలని, గొప్ప చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులను చైతన్యపరిచినారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.

Leave a Reply