కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య

  • గురుకులాలపై పెరుగుతున్న నమ్మకం..
  • విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి..
  • తల్లిదండ్రులు మెచ్చేలా పని చేయండి..
  • మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు
  • రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్

ధర్మారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పోరేట్ స్థాయిలో విద్య అందుతుందని, తద్వారా గురుకుల పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు రోజు రోజుకి నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనం మెనూ ఫై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన , డైనింగ్ హాల్ తో పాటు స్టోర్ రూమ్ను మంత్రి పరిశీలించారు.

మల్లాపూర్ గురుకుల పాఠశాలకు సరఫరా చేసిన సన్న బియ్యాన్ని మంత్రి పరిశీలించారు. బియ్యంలో నూకల శాతం ఎక్కువ ఉన్నందున బియ్యాన్ని వెనక్కి తీసుకొని సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపించాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలలో 27 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వి ద్యను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ తోపాటు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించడానికి చర్యలు తీసుకున్నారని వివరించారు.

గురుకుల పాఠశాలలో మైనర్ రిపేర్ల కోసం రూ. 69 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలపై తల్లిదండ్రులకు రోజు రోజుకి నమ్మకం ఎరుగుతుందని, ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులేనన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన వి ద్యను అందని అందించాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులాల్లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలను వ చౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక నిధులు తీసుకువస్తానని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లనాయక్లు ఉన్నారు.