మృతదేహం పై నగలు మాయం

జగిత్యాల, ఆంధ్రప్రభ ; జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహం పై ఉన్న బంగారు కమ్మలు మాయం అయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో క్రిటికల్ కేర్‌లో చేరి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చెవి కమ్మలు కనిపించకపోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందే కమ్మలు తీసేశారు అంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. శవాల మీద పడి దాచుకునే పరిస్థితి వచ్చిందా అంటూ స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply