గురుకుల పాఠశాలలో డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల పాఠశాలలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పాఠశాలలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి దోమలు పెరుగుతున్న సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రూ.15 లక్షలు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మాణానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని, ఎక్కడైనా సమస్య ఉన్నా ఎమ్మెల్యే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శకుంతల, పీఆర్ ఏఈ చందన్, కార్యదర్శి శాంత, ఎఫ్‌ఏ కమలాకర్, వార్డు సభ్యులు ఉదయ్, అంబాజీ, దేవా, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
