ఆదిమ గిరిజనుల అభివృద్ధి కోసం..

జనభాగీదారి అభియాన్‌కు శ్రీకారం
జైనూర్, మే 23( ఆంధ్రప్రభ) కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా ఆదిమ గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జనభాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు కొమరం భీ0 ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. శనివారం జైనూర్ మండలంలోని రాసిమెట్ట పంచాయతీలో గల మంగుగూడలో పీఎం జంగం పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిడి రమాదేవి పాల్గొని మాట్లాడుతూఈ పథకాన్ని ఆదిమ గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత సామూహిక అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం సందర్భంగా వైద్య ఉద్యోగులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వారి ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించి ఆరోగ్య సమస్యలు తలెత్తుతే వైద్యం చేయించుకోవాలని వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాసిమెట్ట పంచాయతీ సర్పంచ్ ఉయిక చందు, జై నురేపిడిఓ శ్రీనివాస్ ఎస్సీఈఆర్ పి ఉయిక శంకర్, ఉపాధ్యాయులు రవీందర్, విజేందర్, ఉత్తమ్, భీంరావ్ సాంబాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
