రెండు ఆలయాల హుండీలోని నగదు చోరీ

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని మచ్కల్, రాంటెక్ గ్రామాలలోని రెండు ఆలయాలలో హుండీ లోని నగదు చోరికి గురైనట్టు ముధోల్ ఎస్.ఐ బిట్ల పెర్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం మేరకు బుధవారం రాత్రి సమయంలో మచ్కల్ గ్రామంలోని గుట్ట పోచమ్మ ఆలయం తాళం పగులగొట్టి హుండీ ని పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనంలో పడేసి నగదు చోరికి గురైనట్టు తెలిపారు. రాంటెక్ గ్రామం శివాలయంలోని హుండీని కొద్ది దూరంలో పారేసి, పగులగొట్టి నగదు చోరి గురైనట్టు తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్ లు బొమ్మల గంగాధర్, ఆత్మ స్వరూప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముధోల్ ఎస్ ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు.

Leave a Reply