ఇచ్చిన హామీ నెరవేర్చిన సర్పంచ్ కాటం వెంకటేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం శుక్రవారం ఉదారత చాటారు. మండలంలోని పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన గుంటూజి నగేష్ కుమార్తె వివాహం సందర్భంగా నగేష్‌కు ₹10,116 నగదు సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల వివాహం జరిగే ప్రతి కుటుంబానికి ₹10,116 సహాయం అందజేస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. ఆ హామీ మేరకు ఈరోజు నగేష్ కుటుంబానికి సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, ఆనగంటి నరేష్, ఏర్పుల నరసింహ, గంటల పుల్లారెడ్డి, ఏర్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply