వడదెబ్బతో మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వడదెబ్బతో మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఉట్నూర్, ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ (45) ఈ నెల 19న వడదెబ్బతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ బిరుదుల లాజర్‌ను కలిసి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కిరణ్ కుమార్ వడదెబ్బతో మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బొజ్జు పటేల్, ఈ కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, డీసీసీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్, లక్కారం మాజీ సర్పంచ్ మారసుకోల తిరుపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
