మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి

మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి

చలివేంద్రం ప్రారంభంలో ఎస్సై రవికుమార్

జైనూర్, ఆంధ్రప్రభ : సామాజిక కార్యక్రమాల్లో ఇంకా మరింతమంది ముందుకు రావాలని జైనూర్ ఎస్సై రవికుమార్ అన్నారు. ఆయన బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జమీయత్ యే ఉలేమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతుందని, ఆయా పనుల నిమిత్తం జైనుర్ కు వచ్చి పోయే వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జమీయత్ యే ఉలేమా ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జామియాత్ యే ఉలేమా జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా మహరాజ్, సంయుక్త కార్యదర్శి హాఫిజ్ మునియర్, సన్ రైస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ షేక్ జమీర్, మాజీ వైస్ ఎంపీపీ శేక్ రషీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెందుర్ ప్రకాష్, అజు లాల, షేక్ రహీం, షేక్ షఫీక్, కిరణ్ బుతాలే, ఎం ఏ ఆజాద్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అసద్ అలీ, షేక్ మజార్, షేక్ షాకీర్, ఆరిఫ్, రియాజ్, మహేమూద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply