బాబన్న దంపతులకు ఘన సన్మానం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34 వ డివిజన్ శివనగర్ మెట్ల బావి శ్రీ ధన మైసమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. అభిషేక మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ హాజరయ్యారు.
పూజల అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న సంధ్యా దంపతుల వివాహ మహోత్సవం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే నరేందర్ భక్తుల సమక్షంలో శాలువా కప్పి వివాహ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు కలిసి మాజీ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు బాబన్న సంధ్య దంపతులకు శాలువా కప్పి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు కాలనీవాసులు పాల్గొన్నారు.
