కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు మాయం…
కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు మాయం…
- నిర్వాహకుల నిఘా కొరబడిందని రైతుల ఆరోపణ
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : రైతన్నల ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో గురువారం జరిగింది.బాధిత రైతులు కొండ్రెడ్డి సోమిరెడ్డి,ఉదరి అనిల్ లు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర దక్కుతుందని కొనుగోలు కేంద్రానికి వస్తే రక్షణ లేకుండా పోతుందని వాపోయారు.
వేల రూపాయలు వెచ్చించి టార్పిన్లు కొనుగోలు చేసి కప్పుతింటే వాటిని కాస్త అర్ధరాత్రి సమయంలో దొంగలు ఎత్తుకెళ్తున్నారని అన్నారు.దీంతో రైతులు తమ గోడును ఎవరితో చెప్పుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు.కొనుగోలు కేంద్రంలో కనీసం వాచ్ మెన్ కూడా లేకపోవడంతో ఇకపై తమ ధాన్యనికి కూడా రక్షణ ఉండదని రైతులు ఆరోపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
