రేపు పాత కుట్టు మిషన్లు, విడిభాగాల వేలం
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి టీజీఎస్ఆర్టీసీ డిపోలో పాత కుట్టు మిషన్ల వేలం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పి.ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో మొత్తం 40 పాత కుట్టు మిషన్లు, వాటి విడి భాగాలు (స్పేర్ పార్ట్స్), అలాగే మిషన్ ఆయిల్‌ను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వేలం కార్యక్రమం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు సంగారెడ్డి న్యూ బస్ స్టేషన్‌లోని టీజీఎస్ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు, వ్యాపారులు వేలం పాటలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పి.ఉపేందర్ కోరారు.
