ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మునుగోడు, ఆంధ్రప్రభ : ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెంలో నూతనంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ దోటి నారాయణ ఆ గ్రామ సర్పంచ్ గోపగోని పాపయ్య గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.ధాన్యం కొనుగోళ్లలో దళారులకు చోటు లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఏ పి యం గోసుల భాస్కర్,ఏఈఓ మాధగోని నరసింహ గౌడ్,సి సి కోరే యాదయ్య,సి ఆర్ పి దీపిక,వివికె బాలావతి, ఉపసర్పంచ్ రమేష్ పావని,గ్రామ శాఖ అధ్యక్షులు గోపగోని మహేష్,వార్డ్ మెంబర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
